రాజ్​భవన్​ మహిళలకు ఉపాధి శిక్షణ ప్రారంభించిన గవర్నర్

రాజ్​భవన్​ మహిళలకు ఉపాధి శిక్షణ ప్రారంభించిన గవర్నర్

ప్రారంభించిన గవర్నర్​ తమిళిసై

హైదరాబాద్​, వెలుగు: కరోనా సంక్షోభ సమయంలో కుటుంబాలు ఆర్థికంగా కష్టాల పాలవుతున్నాయని, ఆ సంక్షోభాన్ని దాటేందుకు మహిళలు ఆంట్రప్రెన్యూర్​లుగా మారాలని గవర్నర్​ తమిళిసై సూచించారు. ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ పొంది సాధికారత సాధించాలన్నారు. రాజ్​భవన్​ మహిళలకు రెండు నెలల పాటు అసోసియేషన్​ ఆఫ్​ లేడీ ఆంట్రప్రెన్సూర్స్​ ఆఫ్​ ఇండియా అందించనున్న స్వయం ఉపాధి శిక్షణను బుధవారం ఆమె ప్రారంభించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్​ భారత్​ స్ఫూర్తితోనే రాజ్​భవన్​ పరివార్​ మహిళలకు ఈ శిక్షణను ప్రారంభించామని గవర్నర్​ చెప్పారు. మహిళలు సంపాదించిన ప్రతి పైసాకుటుంబ సంక్షేమానికే ఖర్చుపెడతారని, ఇది కుటుంబ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. శిక్షణ పొందిన మహిళలు ఆంట్రప్రెన్యూర్స్​గా ఎదగడానికి అవసరమైన లోన్లు, మార్కెటింగ్​ వంటి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కాలనీలు, రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​లలో కూడా మహిళలు, యువతకు స్వయం ఉపాధి శిక్షణ కోర్సలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడడం కన్నా.. ఉద్యోగాలను ఇచ్చే వారిగా యువతను తీర్చిదిద్దాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన బయోడీగ్రేడబుల్​ పీపీఈ కిట్లు, పర్యావరణ హితమైన హ్యాండీ క్రాఫ్ట్స్​ను గవర్నర్​ మెచ్చుకున్నారు. రాజ్​భవన్​ మహిళలకు మొదటి దశలో 31 మందికి మగ్గం వర్క్స్​, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇస్తామని గవర్నర్​ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్​ తెలిపారు. తర్వాత ఫుడ్​ ప్రొడక్ట్స్​, పేపర్​ క్రాఫ్ట్​, ఫ్యాషన్​ డిజైనింగ్​లో శిక్షణ ఇస్తామని చెప్పారు.

For More News..

ఘాటెక్కిన ఉల్లి.. కిలో @ 60

సరికొత్తగా ‘వన్​ టీచర్ ​వన్​ స్టూడెంట్’

మెరిట్ గిరిట్​ జాన్తానై.. రిజల్ట్స్ రాకుండానే నియామకాలు