హైదరాబాద్, వెలుగు: ఆగస్టు26 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సెక్రటేరి యెట్‌లోని మంత్రి చాంబర్ లో స్పెషల్ సీఎస్ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాలతో చేప పిల్లల పంపిణీ పై రివ్యూ నిర్వహించారు. ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
