
సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ 2022 అవార్డులకు దక్షిణ మధ్య రైల్వే ఎంపికైంది. వివిధ విభాగాల్లో పాటించిన పొదుపు చర్యలకుగాను తెలంగాణ నుంచి నాలుగు, ఏపీ నుంచి రెండు అవార్డులు గెలుచుకుంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణకు చెందిన అవార్డులను హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఏపీ అవార్డులను ఏపీ ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అందజేశారు. తెలంగాణ అందించిన అవార్డుల్లో బిల్డింగుల కేటగిరీలో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు గోల్డ్‌మెడల్ లభించింది. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సిల్వర్మెడల్, ప్రభుత్వ బిల్డింగుల కేటగిరీలో సికింద్రాబాద్ డీఆర్ఎం ఆఫీస్ కు గోల్డ్ మెడల్, ఎకౌంట్స్ఆఫీస్బిల్డింగుకు సిల్వర్మెడల్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి ఆస్పత్రి బిల్డింగుల విభాగంలో విజయవాడ డివిజన్ రైల్వే ఆస్పత్రికి గోల్డ్‌మెడల్, ఆఫీస్ బిల్డింగ్కేటగిరీలో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సెంటర్‌కు సిల్వర్ మెడల్ లభించాయి. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే ఎలక్ట్రికల్ విభాగం, సికింద్రాబాద్, విజయవాడ, హైదరాబాద్ డివిజన్ల మేనేజర్లు, సిబ్బందిని అభినందించారు.
డోన్-కాచిగూడ సెక్షన్‌ను తనిఖీ చేసిన రైల్వే జీఎం
హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ డోన్– కాచిగూడ సెక్షన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ట్రాక్ డ్యూటీలు చేస్తున్న కార్మికులకు స్వెట్టర్లు, ఎక్విప్మెంట్లను పంపిణీ చేశారు. డోన్, బోగోలు, వెల్దుర్తి సెక్షన్ల మధ్య ఉన్న రైల్వే ట్రాక్ మలుపులు, ఎత్తు పల్లాలను పరిశీలించి.. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.