
ఉప్పల్ (హైదరాబాద్), వెలుగు: హోమియో ట్రీట్‌మెంట్‌తో బ్లాక్‌ఫంగస్ వ్యాధిని నివారించవచ్చని రాష్ట్ర ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారు బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని, ఇలాంటి వారి ట్రీట్‌మెంట్ కోసం, అలాగే ముందస్తు నివారణ కోసం హోమియోలో ప్రత్యేకంగా మందులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లోని హోమియోపతి మెడికల్ కాలేజీలో ఆమె మీడియాతో మాట్లాడారు. షుగర్ కంట్రోల్‌లోని లేనివారు, కరోనా ట్రీట్‌మెంట్‌లో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడిన పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ సోకిన కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని వర్షిణి అన్నారు. ఈ వ్యాధి సోకిన రోగులు ఆర్సెనికంఅల్బమ్200 మందును రోజుకు రెండు సార్లు ఆరు గోళీల చొప్పున ఐదురోజుల పాటు, ఫైవ్ఫాస్6ఎక్స్ మందును రోజుకు రెండు సార్లు మూడు గోళీల చొప్పున 30 రోజులు వాడితే బ్లాక్ ఫంగస్ నయమవుతుందని చెప్పారు. జబ్బు తీవ్రత తక్కువగా ఉంటే మందులు ఐదు రోజుల పాటు వాడితే చాలని తెలిపారు. అయితే వీటిని హోమియో డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి బారిన పడినవారు ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని సూచించారు.