అమ్మకానికి అప్పులు

అమ్మకానికి అప్పులు

న్యూఢిల్లీ: మొండి బాకీల వసూలు కోసం స్టేట్​ బ్యాంక్​ రూ. 820 కోట్లకు పైగా విలువైన 12 నాన్​–పెర్ఫామింగ్​ అసెట్స్​ (ఎన్​పీఏ) ఖాతాలను అమ్మడానికి రెడీగా ఉంచింది.   ఈ ఖాతాలను అసెట్ రీకన్‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్​సీలు)/బ్యాంకులు/ ఎన్​బీఎఫ్​సీలు/ఫైనాన్షియల్ సంస్థలకు అమ్ముతామని ప్రకటించింది. ఈ నెల నుండి ఏప్రిల్ 13 వరకు వీటి అమ్మకం కోసం నోటీసులు జారీ చేసింది. రూ. 396.74 కోట్ల లోన్ బకాయిలు చెల్లించలేకపోయిన టాప్‌‌‌‌వర్త్ ఉర్జా & మెటల్స్ లిమిటెడ్ ఖాతాను  మార్చి 29, 2022న జరిగే ఈ–-వేలంలో అమ్ముతారు. రిజర్వ్ ధరను రూ. 85 కోట్లుగా నిర్ణయించారు.  రూ. 186.10 కోట్ల బకాయిలు (రిజర్వ్ ధర రూ. 178.22 కోట్లు) ఉన్న బాలాసోర్ అల్లాయ్స్ ఖాతాను కూడా మార్చి 29న ఈ–-వేలం వేస్తారు. మరునాడు.. అంటే మార్చి 30న బ్యాంక్​ రూ.112.05 కోట్ల విలువైన ఆరు ఎన్​పీఏ ఖాతాలను ఈ–వేలంలో బ్యాంక్ అమ్మేస్తుంది. వీటిలో  అనుపమ్ ఇండస్ట్రీస్ (రూ. 46.38 కోట్లు), క్లచ్ ఆటో (రూ. 26.14 కోట్లు), కింగ్‌‌‌‌స్టన్ పాప్‌‌‌‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 17.15 కోట్లు), సంభవ్ ఎగ్జిమ్​ (రూ. 11.39 కోట్లు), విరాజ్​ కాట్​స్పిన్​ ప్రైవేట్ లిమిటెడ్​ (రూ. 8.06 కోట్లు)  ఘంటాకర్ణ ఎంటర్‌‌‌‌ప్రైజ్ (రూ. 2.93 కోట్లు) ఉన్నాయి. వచ్చే నెల13న మిగిలిన నాలుగు ఎన్‌‌‌‌పిఎ ఖాతాలను వేలం వేస్తారు. వీటి నుంచి రూ. 125.32 కోట్లు రావాల్సి ఉంది.  అనామికా కండక్టర్స్​ రూ. 102.30 కోట్లు, మాధవ్ కాటన్ జిన్నింగ్ & ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ రూ. 16.80 కోట్లు , ఓం కైలాష్ కాటన్ రూ. 5.23 కోట్లు,  అజంతా ఎల్లోరా ఎస్టేట్స్ రూ. 0.99 కోట్లు బకాయిపడ్డాయని స్టేట్​ బ్యాంక్​ ప్రకటించింది.