వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్: భట్టి

వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్నారు. కేసీఆర్ పరిపాలన ఫలితాలు ఇప్పుడే మొదలయ్యాయన్న భట్టి..గత నాలుగేళ్ల గ్రోత్ రేట్ కాంగ్రెస్ ప్రభుత్వ ఫలితమనన్నారు. మెట్రో రైలు పనులు చేపట్టింది కాంగ్రెస్ అని…ఆ రైల్లో తిరుగుతూ ఇది మేమే చేశామని కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు.  బడ్జెట్ ప్రసంగంలో హామీల ఊసే లేదని విమర్శించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలి కానీ అమ్మడం సరికాదన్నారు. మియాపూర్ లోని 850 ఎకరాల్లో పేదవాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాలని డిమాండ్ చేశారు భట్టి. అభివృద్ధి,రాబడి వస్తే నీ గొప్పతనం…లేకుంటే కేంద్రం వైఫల్యమా అని ప్రశ్నించారు.