సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం కొనసాగుతుంది. ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగుతోంది. ఈసారి అజెండాలో చాలా అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రే స్వయంగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. దాదాపు 32 అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. 22 కొత్త జిల్లాల్లో TRS కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు, విశాఖ శారదా పీఠం కోసం స్థలం కేటాయింపు అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మునిసిపల్ కొత్త చట్టం, రెవెన్యూ సంస్కరణలు, లక్షలోపు రుణమాఫి, CPS రద్దు లాంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశముంది.