
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు గురించి చర్చలు కొనసాగుతున్నాయని, అవి పూర్తయ్యాక అన్ని అంశాలను వెల్లడిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తుల అంశంతో పాటు సీట్ల కేటాయింపునకు సంబంధించిన నిర్ణయం కూడా రాష్ట్ర కమిటీయే తీసుకుంటుందని తెలిపారు.