శిశువు జన్మించిన 48 గంటల తర్వాత టెస్టులు చేయాలి : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి

శిశువు జన్మించిన  48 గంటల తర్వాత టెస్టులు చేయాలి : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: శిశువు జన్మించిన 48 గంటల తర్వాత సికిల్ సెల్, అనీమియా, హైపోతలసేమియా స్క్రీనింగ్​ టెస్టులు నిర్వహించాలని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. జిల్లాలోని పలు హాస్పిటల్స్​ను సోమవారం సందర్శించారు. అనంతరం డీఎంహెచ్​లో ఆఫీస్​లో డీఎంహెచ్, డీసీహెచ్ఎస్, ప్రోగ్రాం ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సికిల్ సెల్, అనీమియా, హైపోతల సేమియా స్క్రీనింగ్​ టెస్టులను టీచింగ్ హాస్పిటల్స్​తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. 

స్క్రీనింగ్​ టెస్టులు చేసే స్టాఫ్ నర్సులకు స్పెషల్​ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో కొత్త కేసుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, చర్ల గవర్నమెంట్ హాస్పిటల్స్​లలో ఆయా టెస్టులపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.