ప్రజలకు కనపడని సీఎం రాష్ట్రానికి అవసరం లేదు: బండి సంజయ్

ప్రజలకు కనపడని సీఎం రాష్ట్రానికి అవసరం లేదు: బండి సంజయ్

ప్రజలకు కనపడని సీఎం రాష్ట్రానికి అవసరం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించిన ఆయన…ఎంత మంది ప్రాణాలు పోతే సీఎం కేసీఆర్ స్పందిస్తారన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చారు….ఇక్కడ ఎందుకు కలపడంలేదని ప్రశ్నించారు. పేదప్రజల ను కాపాడే అయుష్మాన్ భారత్ ను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. లాక్ డౌన్ టైమ్ లో ప్రాజెక్ట్ లకు దొడ్డి దారిన టెండర్లు పిలిచి ప్రజల డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. పేదల పాపం ఊకే పోదు.. పేదల కడుపు కొట్టిన పాపం ఊకె పోదు.. ప్రజలే బుద్ది చెబుతారన్నారు. సెక్రటేరియట్ వ్యర్థాలు తరలింపు కోసం 15 కోట్లు కేటాయించారన్న బండి సంజయ్ ..అవే డబ్బులతో పేదలకు కరోనా చికిత్స చేయొచ్చుకదా అని అన్నారు. కాళేశ్వరం, సెక్రటేరియట్ మీద కూడా కేసులు నడుస్తున్నాయి. మరి అవి ఎందుకు ఆపలేదన్నారు. కరోనా సమయంలో కనిపించకుండా పోయిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. ఉస్మానియాను పునర్ నిర్మిస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణం ఆపి.‌.‌ పేదలకు వైద్యం అందించే  ఆస్పత్రిని నిర్మించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరోవైపు బండి సంజయ్ ని ఉస్మానియా హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ నర్సులు, పారిశుధ్య కార్మికులు కలిశారు. గాంధీ ఆస్పత్రిలో పెంచినట్లు తమకు కూడా 25 వేల జీతం పెంచాలని డిమాండ్ చేశారు. తమను ఆదుకునే  విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని కోరారు.