
రంగారెడ్డి: దళిత బంధు స్కీం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని సరూర్ నగర్ లో లబ్దిదారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు స్కీం తీసుకోచ్చామన్నారు. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను తెచ్చారన్నారు. ఇప్పుడు కేంద్రం ధాన్యాన్ని కొనబోమని చెప్పినా.. రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం...