గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని పలు పబ్బు లు, రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఓవర్ ది మూన్ పబ్బులోని రెస్టారెంట్ కిచెన్లో గడువు ముగిసిన ఫుడ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ లో ఎటువంటి లేబుల్స్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించారు.
స్టోర్ రూమ్ లో పాడైన కూరగాయలు, గుర్తింపు లేని బార్బీక్యూ సాస్ సీజ్ చేశారు. డైన్ ఓ చైనా రెస్టారెంట్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు, కిచెన్ చుట్టూ మురుగు ప్రవహిస్తున్నట్లు నిర్ధారించారు. మారెడుమల్లి రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకలు సంచరిస్తుండడంతో మొత్తం మూడు రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.