స్విగ్గీ, హెచ్డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ కో-బ్రాండ్ క్రెడిట్ కార్డులు

స్విగ్గీ, హెచ్డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ కో-బ్రాండ్ క్రెడిట్ కార్డులు

హైదరాబాద్​, వెలుగు:​ ఫుడ్‌‌‌‌‌‌‌‌ డెలివరీ కంపెనీ స్విగ్గీ, హెచ్​డీఎఫ్​సీతో కలిసి స్విగ్గీ బ్లాక్, స్విగ్గీ ఆరెంజ్ పేర్లతో రెండు కొత్త క్రెడిట్ కార్డులు విడుదల చేసింది. ఫుడ్​, ట్రావెల్​, షాపింగ్ విభాగాల్లో మెరుగైన ప్రయోజనాలు అందించడమే వీటి లక్ష్యం. స్విగ్గీ బ్లాక్ కార్డు ద్వారా స్విగ్గీ ఆర్డర్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

వినోదం, ఈ– కామర్స్ ఖర్చులపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. స్విగ్గీ ఆరెంజ్ కార్డు వినియోగదారులకు స్విగ్గీతో పాటు ఇతర ఆన్ లైన్ విభాగాల్లో 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. క్లియర్ ట్రిప్, నైకా వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ లపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయి.