ఆర్టీసీ వర్కర్ల పీఆర్సీని యాది మరిచిన కేసీఆర్

ఆర్టీసీ వర్కర్ల పీఆర్సీని యాది మరిచిన కేసీఆర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయింది. ఆర్టీసీ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ అమలులో మాత్రం ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలు కూడా జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీపై మాత్రం కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు.

పీఆర్సీపై సర్కార్ సైలెంట్ 

ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2017 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉంది. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించకపోవడంతో 2018 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమ్మె చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. దీంతో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల మంత్రుల కమిటీ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలతో చర్చించింది. ఆ సమయంలో 16 శాతం ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. ఇది 2018 జులై 1 నుంచి అమలవుతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 నుంచి మరో పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 

ఒక్కొక్కరికి రూ.లక్ష బకాయి 

ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు నాలుగు డీఏలు రావాల్సి ఉంది. 2019లో ఒకటి, 2020లో రెండు డీఏలు, ఈ ఏడాది జనవరితో కలిపి మొత్తం నాలుగు డీఏలు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఇక 2015లో ఆర్టీసీ కార్మికులకు 44 శాతం జీతాలు పెంచింది. పెరిగిన జీతాలు 2013 ఏప్రిల్1 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ సంస్థ వద్ద డబ్బులు లేకపోవడంతో పెరిగిన జీతాల బకాయిలను బాండ్ల రూపంలో ఇచ్చారు. 8.5 శాతం వడ్డీతో ఐదేండ్ల తర్వాత చెల్లించేలా ఈ బాండ్లను జారీ చేశారు. కానీ ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పైసా చెల్లించలేదు. ఒక్కొక్కరికి రూ. లక్ష దాకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

లోన్ వస్తేనే జీతాలిచ్చే పరిస్థితి? 

ఆర్టీసీ ఉద్యోగులకు జీతాల కష్టాలు కూడా తప్పడంలేదు. ప్రతి నెలా శాలరీ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నాలుగు నెలలుగా 10వ తేదీ తర్వాతే జీతాలు అకౌంట్లలో వేస్తున్నారు. అధికారులు మాత్రం ఒకటో తేదీ రాగానే అలవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీసుకుంటున్నారని యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కరోనా, లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో డబ్బుల్లేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం రోజువారీ కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 3 కోట్లు కూడా దాటడంలేదు. ఆర్టీసీ దరఖాస్తు పెట్టుకున్న లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులు వస్తేనే శాలరీలు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు రిటైరైన ఉద్యోగుల పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులు కూడా సరిగా ఇవ్వడంలేదు. వారికి నెలకు రూ. 2 వేల నుంచి 4 వేల మధ్య మాత్రమే ఇస్తున్నారు. 

ఆర్టీసీలోనూ పీఆర్సీ అమలుచేయాలె  

ఆర్టీసీ ఉద్యోగులు రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ కార్మికులకు కూడా పీఆర్సీ అమలు చేయాలి. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఈ నెల జీతాలు కూడా ఇంకా రాలేదు. రిటైరైన వారికి పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులు వస్తలేవు. సర్కారు వెంటనే ఆర్టీసీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.
- కమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంయూ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సర్కార్ తీరు కక్షపూరితం 

రోజూ16 గంటల వరకూ పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచకుండా మొండిచేయి చూపడం సరికాదు. చాలీచాలని జీతాలతో డ్యూటీలు చేస్తున్నా ప్రభుత్వం, యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పద్ధతి మానుకోవాలి. ఫిట్‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించి, అమలు చేయాలి.  
- హనుమంతు ముదిరాజ్,   టీజేఎంయూ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ