తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని కేసీఆర్కు  ప్రత్యేక ఆహ్వానం
  • ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని కేసీఆర్ ను ప్రత్యేకం గా ఆహ్వానిం చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు కేసీఆర్ కు లేఖ రాశారు. కేసీఆర్ కు వ్యక్తిగతంగా కలిసి లేఖ అందజేయాలని ప్రోటోకాల్ సలహాదారునికి బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. 

జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు  రాష్ట్ర అవతరణ దినోత్స వాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ అధికారిక కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం  7 గంటల నుంచి 9 గంటల వరకు సంబురాలు  నిర్వహిస్తారన్నారు. ఈ సంద ర్భంగా ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు, వస్తువుల స్టాల్స్  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.