హైదరాబాద్ సిటీలో గంజాయి రవాణా, వినియోగం లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో సిటీ మొత్తం జల్లెడ పడుతోంది. ఆపరేషన్ ధూల్పేట్ లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ధూల్పేట్ ప్రాంతంలో వాడవాడ, ప్రతి ఇల్లు తనిఖీ చేస్తున్నారు. పోలీసులు బృందాలుగా సోదాలు నిర్వహిస్తు న్నారు. ఆగస్టు 31 లోపు ధూల్పేట్ లో గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఎక్సైజ శాఖ పనిచేస్తోంది.
బుధవారం జూలై 24, 2024న ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ పోలీసు టీంలతోపాటు స్థానిక పోలీసులు జాయింట్ గా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ కమిషనర్ శ్రీర్ , ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు ధూల్పేట్ లో ని అను మానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన పాత నేరస్తులతోపాటు కొత్తగా గంజాయి అమ్మకాల్లో దిగిన వారి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు.
ధూల్పేట్ లో జుమ్మెర బజార్, దేవీ నగర్, చక్కెర వాడి, జుంగూర్ బస్తి, సేవాదళ్ ఇమ్లీబాగ్, బలరాం గల్లి మాగ్ర , గంగాబౌలి, మతిం ఖా నా, చున్నీకి బట్టి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 8 ప్ర త్యేక బృందాలతో 50 మందికి పైగా పోలీసులు ఉన్నతాధికారులు కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న అధికారుల్లో ఎన్ ఫోర్స్:మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్, జాయింట్ కమిషనర్ , హైదరాబాద్ కమిషనర్ , హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
