లాయర్ దంపతుల హత్య కేసు.. పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?

లాయర్ దంపతుల హత్య కేసు.. పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?

వామనరావు  దంపతుల  హత్య  కేసులో స్పెషల్ కోర్టు  ఏర్పాటు  చేయాలని  హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం  లెటర్ రాసింది.  కరీంనగర్ జిల్లాలోని   ఒక కోర్టును  కేసు విచారణకు  కేటాయించాలని కోరింది.హత్య కేసును  స్పెషల్ కోర్టులో  విచారించాలంటూ  తెలంగాణ న్యాయశాఖ  సెక్రటరీ కోర్టుకు లెటర్ లో  విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు  తమ అదుపులో  ఉన్నాడని  ఇవాళ రామగుండం పోలీసులు తెలిపారు. ఐతే... స్పెషల్  కోర్టు విచారణ  కోరుతూ  నిన్ననే న్యాయశాఖ..  హైకోర్టుకు లెటర్ పంపింది. 

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. గత వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలపై రామగుండం పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.వామనరావు దంపతుల హత్య కేసులోనూ పుట్ట మధుపై బలంగా ఆరోపణలు వినిపించాయి. పుట్ట మధు మేనల్లుడు  బిట్టు శీను  కూడా ఈ కేసులో నిందితుడే. పుట్టా మధును ఈ కేసులో ఇప్పటికే రామగుండం కమిషనరేట్ పోలీసులు ఓసారి విచారించారు. వామనరావు తండ్రి కిషన్ రావు ఇటీవల మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ పైనా పుట్ట మధును టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే... పుట్ట మధును ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనేదానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.  

పుట్ట మధు మొదటి నుంచి ఈటల అనుచరుడిగా ఉన్నారు. ఈటల వ్యవహారం తర్వాతే పుట్ట మధుకు చెక్ పెట్టారన్న వాదలను వినిపిస్తున్నాయి. మరోవైపు వామన్ రావు మర్డర్ కేసులో ఆయన తండ్రి ఇచ్చిన మరో ఫిర్యాదుపైనే పుట్ట మధును  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఎవరేం చెప్పినా మధు ఎపిసోడ్ లో సస్పెన్స్  కంటిన్యూ అయింది. ఈటల నియోజవర్గం హుజురాబాద్ లో ఉన్నతాధికారుల బదిలీలు వరుసగా జరుగుతున్నాయి. ఈటల అనుచరులపై పాత కేసుల్ని తవ్వుతున్నారు. ఇప్పుడు పుట్ట మధు ఎపిసోడ్ కూడా అటువంటిదేనన్న ప్రచారం జరుగుతోంది.