దళితుల పట్ల కేసీఆర్ సర్కార్ వివక్ష : ఆర్ఎస్పీ

దళితుల పట్ల కేసీఆర్ సర్కార్ వివక్ష : ఆర్ఎస్పీ

రాష్ట్రంలో గ్రామ దేవతలకు ఆదరణ కరువైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజనులు ఎక్కువగా ఆరాధించే  దేవతల ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు.  హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్నజాతర నేపథ్యంలో స్వామి వారికి ఆయన శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలోనూ దళితురాలైన రాణి కుముదినికి అన్యాయం చేసిందన్నారు. ఈ వివక్ష అంతమొందాలంటే రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.