యాసంగిలో వరి పంట వేయొద్దు

 యాసంగిలో వరి పంట వేయొద్దు

యాసంగిలో వరిసాగు చేయొద్దని రైతులకు చెప్పింది రాష్ట్ర సర్కార్. పారాబాయిల్ట్ రైస్ తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని.. అందువల్ల యాసంగిలో వరిసాగు చేయొద్దన్నారు సీఎస్ సోమేష్ కుమార్. యాసంగిలో పండే ధాన్యం పారాబాయిల్డ్ రైస్ తయారీకే అనుకూలంగా ఉంటుందన్నారు. సీడ్ కంపెనీలు, మిల్లర్లతో ముందుగా ఒప్పందం ఉన్నవారు.. సొంతానికి వాడుకోవడం కోసం అయితేనే వరిసాగు చేసుకోవచ్చని చెప్పారు. వడ్ల కొనుగోళ్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.. ఇంతకముందు సీఎం కేసీఆర్ చెప్పిన మాటలనే రిపీట్ చేశారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర సర్కార్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలో రాష్ట్రమంత్రులతో మాట్లాడిన అంశాలపై ఇవాళ క్లారిటీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం.. తెలంగాణలో ధాన్యం సేకరణ యథావిధిగా కొనసాగుతోందని తెలిపింది. ధాన్యం కొనబోమని తాము ఎక్కడా చెప్పలేదని చెప్పింది కేంద్రం. ముందే నిర్ణయించిన కనీస మద్దతు ధరకే కొనుగోళ్లు కంటిన్యూ అవుతాయని చెప్పింది. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ అధికారులు.