మీరేం చేసిన్రో చెప్పండి
టీచర్ల పనితీరు తెలుసుకునేందుకు కేంద్రం తెచ్చిన టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రుబ్రిక్స్(టీఎస్ఏఆర్) విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సన్నద్ధమైంది. గతం నుంచే ఈ విధానం అమల్లో ఉన్నా, రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 16,17 తేదీల్లో టీచర్లకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో మొత్తం1.16 లక్షల మందికి పైగా టీచర్లున్నారు. కాగా, టీచర్ల పనితీరును పరిశీలించేందుకు గాను కేంద్రం 2013లోనే టీచర్ల పనితీరు సూచిక (పిన్ డిక్స్)ను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం మన రాష్ట్రంలో రెండేండ్లు అమలవ్వగా, ఆ తర్వాత నుంచి అమలు కాలేదు. తాజాగా పిన్ డిక్స్ ను టీఎస్ఏఆర్ గా మార్చిన కేంద్రం.. దీన్ని అన్ని రాష్ర్టాలు అమలు చేయాలని ఆదేశించింది. మార్చి నెలాఖరులో రాష్ట్ర స్థాయిలో సమగ్ర శిక్షా అధికారులకు ట్రైనింగ్ ఇచ్చా రు. టీఎస్ఏఆర్ లో భాగంగా పిల్లలతో టీచర్లు ఎలా ఉంటున్నారు? పాఠాలు ఎలా చెప్తున్నారు? స్కూల్ పరిశుభ్రతలో వారి పాత్ర? పిల్లలను రెగ్యులర్‌గా స్కూల్‌కు రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలు తెలుసుకోనున్నారు.
ఇయ్యాల, రేపు టీచర్లకు ట్రైనింగ్...
ఉమ్మడి రాష్ట్రంలో టీచర్లు తమ పనితీరుపై మాన్యువల్‌గా రిపోర్టు ఇచ్చారు. కానీ ఈ ఏడాది నుంచి దా న్ని వర్చువల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16,17 తేదీల్లో ప్రతిరోజు 2 సెషన్లలో టీచర్లందరికీ ఆన్ లైన్ లో ట్రైనింగ్ జరగనుంది. ఇందులో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, లాంగ్వేజీ పండిట్లు, పీఈటీలు, పీడీలు, కేజీబీవీ, మోడల్ స్కూల్‌టీచర్లు.. ఇలా అందరినీ భాగస్వాములను చేయనున్నారు. ట్రైనింగ్ తర్వాత 47 ప్రశ్నలను పంపి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోను న్నారు. టీచర్లు తమ పనితీరు చెక్ చేసుకొని, ఆ మే రకు డెవలప్ కావడం, తమ బలాలు, బలహీనతలు తెలుసుకోవడం, పొరపాట్లను గుర్తించడం లాంటిఉద్దేశాలతో దీన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
