గద్దర్ పై కేసు ఉపసంహరించిన రాష్ట్ర ప్రభుత్వం

గద్దర్ పై కేసు ఉపసంహరించిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై ఉన్న కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. శుక్రవారం ఉదయం గద్దర్ నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. తనపై కేసు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు గద్దర్ అందించారు.

సరిగ్గా 28 ఏళ్ల క్రితం అమ్ముగూడ రైల్వేస్టేషన్ పేలుడు ఘటనలో గద్దర్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును తొలగించాలని ప్రభుత్వం, డీజీపీని గద్దర్ కోరారు. దీంతో గద్దర్ పై ఉన్న కేసును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వు కాపీలను గద్దర్ పోలీసులకు అందించారు. ఈ ఉత్తర్వులను కోర్టు సమర్పిస్తామని నేరేడ్‌మెట్ పోలీసులు గద్దర్‌కు తెలిపారు.