
మాదాపూర్, వెలుగు: చేనేత కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. మాదాపూర్ శిల్పారామంలో మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ నినాదంతో హత్కర్గా మేళా (స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో)ను శనివారం ఆయన ప్రారంభించారు.
19 రాష్ట్రాల చేనేత హస్తకళా ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. వచ్చే నెల 2 వరకు ఎక్స్పో ఉంటుందని నిర్వాహకులు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మేళా నిర్వాహకులు పాల్గొన్నారు.