636 మంది పోలీసులకు పతకాలు

636 మంది పోలీసులకు పతకాలు
  • ఏడుగురికి శౌర్య పతకాలు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 636 మంది పోలీసులకు రాష్ట్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. రాష్ట్ర శౌర్య పతకం, మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం, సేవా పతకం కేటగిరీలకు సంబంధించి హోంశాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ జితేందర్‌‌‌‌ సోమవారం జీవో విడుదల చేశారు. పోలీస్,ఫైర్ సర్వీసెస్‌‌,స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు చెందిన సిబ్బంది వివరాలను లిస్ట్‌‌లో పేర్కొన్నారు. ఏడుగురికి స్టేట్ పోలీస్ శౌర్యపతకాలు లభించాయి.

ఇందులో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ఉపేందర్ కు ఒకటి, ఫైర్ డిపార్ట్ మెంట్ లోని సుధాకర్ రావు, రమేశ్, నవీన్ కుమార్, నాగయ్య, ఆదర్శ్, ఐజాజ్ కు పతకాలు లభించాయి. మహోన్నత సేవా పతకానికి గాను 10 మంది, ఉత్తమ సేవా పతకానికి 104 మంది, కఠిన సేవా పతకానికి 42 మంది,సేవా పతకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 473 మంది పోలీసులకు పతకాలు ప్రకటించారు.ఈ పతకాలను త్వరలోనే అందించనున్నారు.