భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామిని రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈవో దామోదర్‌రావు వారికి స్వాగతం పలికి, పూజల అనంతరం ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కాగా, లక్ష్మీతాయారు అమ్మవారికి మాత్రం ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు.
