నాగర్కర్నూల్ జిల్లా గురుకుల స్కూల్లో ఫుడ్పాయిజన్పై హెచ్ఆర్సీ సీరియస్

నాగర్కర్నూల్ జిల్లా గురుకుల స్కూల్లో ఫుడ్పాయిజన్పై హెచ్ఆర్సీ సీరియస్

బషీర్​బాగ్, వెలుగు: నాగర్​కర్నూల్ జిల్లా గురుకుల స్కూల్​లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వివిధ పత్రికల్లో  వచ్చిన వార్తలను సుమోటోగా స్కీకరించి విచారణ చేపట్టింది. ఈ ఘటనపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్​ఆర్సీ ఆదేశించింది.