
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతినెలా 5 లోపు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయంలో ఉపాధిహామీ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ ప్రతినిధులు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, 2024–-25, 2025–-26 ఆర్థిక సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న 21 నెలల ఎంపీడీవో కార్యాలయాల అడ్మినిస్ట్రేటివ్ బిల్లులు వెంటనే విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని సీతక్కకు విన్నవించారు.
మంత్రి తక్షణమే స్పందించి.. ఫైనాన్స్ సెక్రటరీ సుల్తానియాకు దసరా పండుగకు ముందు జీతాలు విడుదల చేయాలని ఆదేశించనున్నట్టు తెలిపారు. అడ్మిన్ బిల్లులను దసరా తర్వాత విడుదల చేస్తామని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.