సమస్యలపై మంత్రిని కలసిన ఎంపీటీసీలు

సమస్యలపై మంత్రిని కలసిన ఎంపీటీసీలు

హైదరాబాద్: ‘‘ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం ప్రొటోకాల్ కూడా దక్కడం లేదు.. మమ్మల్నే ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంటే ఇక ప్రజలకేం సహాయం చేస్తాం.. వారి సమస్యలేం పరిష్కరిస్తాం’’ అంటూ ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని రాష్ట ఎంపీటీసీల సంఘం నాయకులు కలసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మూడేళ్లుగా సరిపడ నిధులు లేక..సరియైన ప్రోటో కాల్ లేక  ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవర్చలేక పోతున్నామని తెలిపారు. తమ సమస్యలు, డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హమీ ఇచ్చారని ఎంపీటీసి సంఘం నాయకులు మీడియాకు తెలిపారు. 

ఎంపీటీసీల డిమాండ్లు..

  • అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి ఎంపీటీసీకి ఏటా 20 లక్షలు  ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి.
  • బడ్జెట్లో ప్రకటించిన 500 కోట్లలో మిగతా 250 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
  • గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ గౌరవ స్థానం కల్పించాలి.