కొత్తగూడెంలో పర్యటించిన.. రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ

కొత్తగూడెంలో పర్యటించిన.. రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్​ కొత్తగూడెం ఏరియాలో రాష్ట్ర స్థాయి   అప్రైజల్​  కమిటీ సభ్యులు సోమవారం పర్యటించారు. ఏరియాలోని పద్మావతి ఖని మైన్​ మేనేజర్​ ఆఫీస్​లో  మైన్​కు సంబంధించి వివరాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. బొగ్గు గనికి అవసరమైన పర్యావరణ అనుమతులపై డిస్కస్​ చేశారు. బొగ్గు ఉత్పత్తి, కోల్​ ట్రాన్స్​పోర్టు వివరాలపై చర్చించారు. 

అండర్​ గ్రౌండ్​లో పని ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం కేవీ ఓసీ మైన్​ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఏకో పార్కును సందర్శించారు. ఈ కమిటీలో డాక్టర్​ ఎ. వెంకట రాజశేఖర్​, డాక్టర్​ సరిత సజ్జ, దినేస్​ కుమార్​లతో పాటు ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి పాల్గొన్నారు. 

పద్మావతిఖని మైన్​ను సందర్శించిన కోల్​ క్వాలిటీ ఆర్గనైజేషన్​ బృందం:

ఏరియాలోని పద్మావతిఖని మైన్​ను కోల్​ క్వాలిటీ ఆర్గనైజేషన్​ బృందం సందర్శించింది. కోల్​ గ్రేడ్​ వెరిఫికేషన్​ చేయనున్నారు. ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యతను పరిశీలించి గ్రేడ్​ను డిసైడ్​ చేస్తారు. ఈ ప్రోగ్రాంలో సీసీఓ శ్రీనివాస్​, డీజీఎంలు దుర్గ ప్రసాద్​, కేఎస్​ఎన్​ రాజు, ఏజెంట్​ రాంభరోస్​ మహతో, క్వాలిటీ కంట్రోల్​ ఇంచార్జీ శ్రావణ్​ కు మార్​ పాల్గొన్నారు.