
హైదరాబాద్, వెలుగు : సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ (ఎస్ఎంఐ) స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి శాంక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈఎన్సీ జనరల్ చైర్మన్‌గా, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) చీఫ్ ఇంజినీర్ ను కన్వీనర్‌గా నియమించింది.
ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాల్‌బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్ వై ) పథకంలో భాగంగా ఎస్ఎంఐ స్కీమ్‌ను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ప్రధానంగా 20 నుంచి 2 వేల హెక్టార్లలోపు ఉన్న చెరువులు, ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం 60శాతం నిధులను స్కీమ్ కింద సమకూర్చుతుంది. 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.