
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆదివారం సీపీఎం, సీపీఐ పార్టీల జాయింట్ మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి చీఫ్ గెస్టులుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు బీవీ రాఘవులు, నారాయణ తదితరులు అటెండ్ కానున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు కమ్యూనిస్టు పార్టీలు ఇంతపెద్ద ఎత్తున సమావేశం నిర్వహించనుండటం ఇదే తొలిసారి. బీజేపీపై పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉండటంతో లెఫ్ట్ పార్టీల మీటింగుకు ప్రాధాన్యత సంతరించుకుంది.