ఏప్రిల్ 30న స్టేట్ లెవల్ మోడల్ నీట్

ఏప్రిల్ 30న స్టేట్ లెవల్ మోడల్ నీట్

ముషీరాబాద్, వెలుగు: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సౌజన్యంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు స్టేట్​లెవల్ మోడల్ ఈఏపీసీఈటీ, ఏప్రిల్ 30న స్టేట్​లెవల్ మోడల్ నీట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. శుక్రవారం చిక్కడపల్లి ఎస్ఎఫ్ఐ స్టేట్​ఆఫీసులో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజులు మీడియాతో మాట్లాడారు. పోటీ పరీక్షలంటే భయం పోగొట్టేందుకు ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుందన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో స్పష్టమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

 నీట్, ఎపిక్ సెట్, జేఈఈ కోచింగ్​పేరుతో కార్పొరేట్ కాలేజీలు లక్షల వసూలు చేస్తున్నాయని, పర్మిషన్​లేకుండానే అకాడమీలు నడుపుతున్నాయని ఆరోపించారు. పేద విద్యార్థుల కోసమే మోడల్​టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. వివరాలకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను సంప్రదించాలని లేదా 94900 98292, 82476 72658 ద్వారా సంప్రదించవచ్చు అని చెప్పారు. ప్రెస్ మీట్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జూనుగరి రమేశ్​తదితరులు పాల్గొన్నారు.