ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొమరం భీమ్ స్టేడియంలో మూడో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియనా జెడ్ చోంగ్తు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక ఐటీడీఏ పీవో అంకిత్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి క్రీడా ప్రాంగణంలోని వేదిక వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.
క్రీడల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసిన అధికారులను ప్రశంసించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 1,668 మంది స్టూడెంట్లు హాజరయ్యారు. వాలీబాల్, ఖోఖో, ఆర్చరీ, అథ్లెటిక్స్, క్యారమ్, చెస్పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20 వరకు పోటీలు కొనసాగనున్నాయి.
