
హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కడవెండిలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ లాంటి అనుభవమున్న నేత, అత్యంత ప్రతిభావంతుడైన కేటీఆర్ వంటి నాయకులు మరే పార్టీలో లేరని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ లో చేరిన వారిలో దేవరుప్పుల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప్పుల సోమయ్య, ఉప్పుల మల్లయ్య, ఉప్పుల హరిచంద్రు, బాషిపాక పరశురాములు, ఉప్పుల అంజయ్య, ఉప్పుల మధు, చీటూరు యాదగిరి, చీటూరు రాజ్ కుమార్, బండిపెల్లి నవీన్, బండిపెల్లి ప్రదీప్, బాషిపాక శోభన్ బాబు, జోగు ప్రవీణ్, ఉప్పుల ఎల్లయ్యలు ఉన్నారు. అలాగే కడవెండి గ్రామ పార్టీ కార్యదర్శి బాషిపాక కుమార్, సాంస్కృతిక కార్యదర్శి జీడి నర్సింహ, సిపిఐకి చెందినసులుగురి సురేశ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన బాషిపాక కృష్ణ, బాషిపాక యాదయ్య, బెజగం సురేశ్, బాషిపాక వంశీ, దండెంపల్లి అయిలయ్య, తాళ్ళపెల్లి మదార్, దండెంపల్లి మహేశ్ తదితరులు ఉన్నారు.