V6 News

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి సీతక్క

కాంగ్రెస్ అభ్యర్థులను  గెలిపించాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని రెండో దశలో పోలింగ్​జరిగే ములుగు, వెంకటాపూర్​మండలాల్లో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్​అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ములుగు మండలంలోని జంగాలపల్లి, ఇంచర్ల, వెంకటాపూర్​ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. 

పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్​నాయకులు ముసినపల్లి కుమార్​గౌడ్, కూనూరు అశోక్ గౌడ్​పాల్గొన్నారు.