సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం

సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం

హైదరాబాద్: సర్వాయి పాపన్న గౌడ్‌ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. ఈ నెల 18న సర్వాయి పాపన్న 372వ జయంతిని పురస్కరించుకొని పాపన్న జయంతి ఉత్సవాలు మంగళవారం చిక్కడపల్లిలో ప్రారంభమయ్యాయి. కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్... సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు.  గోల్కొండ కోటకు మొదటి బహుజన రాజు సర్వాయి పాపన్న అని అన్నారు.  

సర్వాయి పాపన్న జీవితాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బాలగౌని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.