శిల్పారామంలో రాష్ట్ర యువజనోత్సవాలు షురూ

శిల్పారామంలో రాష్ట్ర యువజనోత్సవాలు షురూ

మాదాపూర్​, వెలుగు :  రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులు జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు-– 2024  మాదాపూర్​ శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో శుక్రవారం షురూ అయ్యాయి.  యువజన సర్వీసుల శాఖ కమిషనర్, డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. 

రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, జానపద సాంస్కృతిక అంశాలు ప్రతిబింబించేలా 33 జిల్లాలకు చెందిన యువతీ యువకులు అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో జానపద గాయని, గాయకులు అరుణ సుబ్బారావు, లింగా శ్రీనివాస్, డి. ప్రశాంత్ కుమార్, టీఎస్ స్టెప్ జనరల్ మేనేజర్ కే వేణుగోపాలరావు, డిప్యూటీ డైరెక్టర్ అనంత్ రెడ్డి, మేనేజర్ జగన్నాథం, ఎకౌంట్స్ ఆఫీసర్  టీ ఓం ప్రకాశ్ తదితరులు  పాల్గొన్నారు.