
స్టేషన్ ఘన్పూర్: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి తాటికొండ లక్ష్మీ (87) అనారోగ్యంతో మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సంతాపం తెలియజేశారు.