హసన్ పర్తి, వెలుగు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. శనివారం జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో హసన్ పర్తిలో మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్, చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మహిళలపై వేధింపులు, సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై అవగహన కల్పించారు.
కార్యక్రమానికి హాజరైన సీపీ మాట్లాడుతూ డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు అంధకారం మారుతుందని, ఎవరైనా డ్రగ్స్ విక్రయించిన, వినియోగించిన డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాణించిన విద్యార్థులను సీపీ సత్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీలు జితేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
