
- పోలీస్ కంప్లయింట్స్ అథారిటీకి హోంశాఖ స్పెషల్ సీఎస్, డీజీపీ రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ (ఎస్‌పీసీఏ) చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ బి. శివశంకర్ రావు, అథారిటీ సభ్యులను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ మంగళవారం కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఉన్న ఎస్‌పీసీఏ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అథారిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలను అందించేందుకు అవసరమైన చర్యలపై చర్చ జరిగింది.
దీనికి హోంశాఖ, డీజీపీ కార్యాలయం నుంచి అథారిటీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రవి గుప్తా, జితేందర్ హామీ ఇచ్చారు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, సమర్థతను పెంచేందుకు అథారిటీ కీలక పాత్ర పోషించాలని కోరారు.కార్యక్రమంలో ఎస్‌పీసీఏ సభ్యులు పి. ప్రమోద్ కుమార్, వర్రె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.