డివిడెండ్ అందని వారికి సాయంగా హైదరాబాద్‌‌లో నివేశక్‌‌ శివిర్ కార్యక్రమం

డివిడెండ్ అందని వారికి సాయంగా హైదరాబాద్‌‌లో నివేశక్‌‌ శివిర్ కార్యక్రమం

హైదరాబాద్: షేర్‌‌హోల్డర్లు క్లెయిమ్ చేసుకోని షేర్లు, డివిడెండ్లను తిరిగి పొందడంలో సాయం చేసేందుకు   సెబీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇన్వెస్టర్‌‌‌‌ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్‌‌ఏ) కలిసి శనివారం హైదరాబాద్‌‌లో  "నివేశక్ శివిర్" కార్యక్రమాన్ని   నిర్వహించాయి.  అలాగే పెట్టుబడిదారుల అవగాహన పెంచడంపై ఫోకస్ పెట్టాయి. ఈ శివిర్ బీఎస్‌‌ఈ, ఎన్‌‌ఎస్‌‌ఈ, ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌,  కేఫిన్‌‌ టెక్‌‌, బిగ్‌‌షేర్‌‌‌‌, పూర్వా, ఎంయూఎఫ్‌‌జీ వంటి ప్రముఖ మార్కెట్ సంస్థల సహకారంతో జరిగింది. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, రిటైల్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఇందులో పాల్గొన్నారు.  సీడీఎస్ఎల్‌‌  రూపొందించిన "ఇన్వెస్టర్ గైడ్"ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.