
హైదరాబాద్: ఎవర్‌లూమ్ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ హైదరాబాద్‌లోని పంజాగుట్టలో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ఈవెంట్‌కు నటి పూనమ్ కౌర్, వీ-హబ్ సీఈఓ సీతా పల్లచోల ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎవర్‌లూమ్ బ్రాండ్ కొత్తగా తీసుకొచ్చిన ఆలోచనా విధానాన్ని అభినందించారు. ఈ ల్యాబ్‌లో తయారైన ఈ డైమండ్స్ లగ్జరీలో కొత్త మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఎవర్‌లూమ్‌ను నివేదిత సోమ, ఇషితా తయాల్, డా. అముల్య రావులు కలిసి ఏర్పాటు చేశారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ దక్షిణ మండల ప్రాంతీయ చైర్మన్ మహేందర్ తయాల్ సహకారంతో, ఈ బ్రాండ్‌ను తొలి వుమెన్ -సెంట్రిక్ ల్యాబ్ -గ్రోన్ డైమండ్ షోరూంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. 20కి పైగా వజ్రాల కట్‌లతో, సాంప్రదాయ డిజైన్‌ల నుంచి సమకాలీన డిజైన్ల వరకు భారీగా కలెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు.