
- కిమ్స్ సీఎండీ డాక్టర్ భాస్కర రావు
హైదరాబాద్, వెలుగు: రీసెర్చ్‌లు ప్రజారోగ్యానికి ఉపయోగపడేవిగా ఉండాలని కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కర రావు అన్నారు. శనివారం కిమ్స్ హాస్పిటల్ కు అనుబంధంగా ఉన్న కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసర్చ్ సెంటర్ (కేఎఫ్ఆర్సీ) ఆధ్వర్యంలో ట్రాన్స్లేషనల్ రీసర్చ్, జనోమిక్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై ఒకరోజు సింపోజియంసదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డాక్లర్లు అధునాతన టెక్నాలజీపై దృష్టి పెట్టాలని సూచించారు.
కేఎఫ్ఆర్సీ అనేది స్టెమ్ సెల్ ఆధారిత పునరుత్పత్తి వైద్యం, బయోమార్కర్ డిస్కవరీ, లిక్విడ్ బయాప్సీ, మాలిక్యూలర్ జనెటిక్స్, టెలిరేడియాలజీ, న్యూరోబయాలజీ రంగాల్లో విశేష పరిశోధనలు నిర్వహిస్తున్నదన్నారు. ప్రస్తుతం మెడికల్ డివైజ్‌ల రంగంలో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. సదస్సులో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డా. జీ.ఎన్. రావు ముఖ్య అతిథిగా హాజరై ట్రాన్స్లేషనల్ రీసర్చ్ వైద్య రంగానికి ఎంత ముఖ్యమో వివరించారు.