
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో ( డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పాటు డైట్, బీఈడీ కాలేజీల్లోని లెక్చరర్ల ఖాళీలనూ నింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని సుమారు 140 పోస్టులను నింపేందుకు చర్యలు ప్రారంభించింది.
దీనికి సంబంధించిన వివరాలను టీజీపీఎస్సీకి విద్యాశాఖ అధికారులు పంపించారు. కొత్త రోస్టర్ వివరాలనూ ఇటీవలే కమిషన్కు ఇచ్చారు. కాగా, 28 డిప్యూటీ ఈవో పోస్టులతో పాటు డైట్ సీనియర్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, బీఈడీ, బీపీఈడీ కాలేజీ లెక్చరర్ల పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.