స్టీవ్‌‌ స్మిత్‌‌కు రూ. 12లక్షల ఫైన్

స్టీవ్‌‌ స్మిత్‌‌కు రూ. 12లక్షల ఫైన్

అబుదాబి: రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌కు రూ.12 లక్షల ఫైన్‌‌ వేశారు. ముంబై ఇండియన్స్‌‌ తో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ స్లో ఓవర్‌‌ రేటే ఇందుకు కారణం. ‘అబుదాబి వేదికగా ఈ నెల ఆరో తేదీన ముంబై ఇండియన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ నిర్ణీత సమయంలో బౌలింగ్‌‌ పూర్తి చేయలేదు. దీంతో ఆ టీమ్​ కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌కు ఫైన్‌‌ వేశాం. మినిమమ్‌‌ ఓవర్‌‌ రేట్‌‌ అంశంలో  ఈ సీజన్‌‌లో ఆ జట్టు చేసిన తొలి తప్పు ఇదే కావడంతో  ఐపీఎల్‌‌ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌ ప్రకారం జరిమానాతో సరిపెట్టాం. స్మిత్‌‌కు రూ.12 లక్షలు ఫైన్‌‌ వేశాం’ అని ఐపీఎల్‌‌ ప్రకటించింది. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ 57 రన్స్‌‌ తేడాతో ఓడిపోయింది. అంతకుముందు ఈ సీజన్‌‌లో బెంగళూరు కెప్టెన్‌‌ కోహ్లీ, ఢిల్లీ కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ స్లో ఓవర్‌‌ రేట్‌‌ ఫైన్‌‌  ఎదుర్కొన్నారు.

For More News..

నేడు హైదరాబాద్ వర్సెస్ పంజాబ్

ఛేజింగ్‌‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి