అత్యంత వేగంగా 14వేల పరుగులు చేసిన స్టీవ్ స్మిత్

అత్యంత వేగంగా 14వేల పరుగులు చేసిన స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 14వేల పరుగులు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్మన్గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఆసీస్ తరపున అత్యంత వేగంగా 14వేల పరుగుల మార్కును సాధించిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో 94 పరుగులు చేయడం ద్వారా స్మిత్ ఈ మైలురాయిని అందుకున్నాడు. డేవిడ్ బూన్ (13,386) ను దాటిన స్టీవ్ స్మిత్.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 9వ బ్యాట్స్మన్గా నిలిచాడు. 

స్మిత్ కెరీర్..
ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లు కలిపి 288 మ్యాచులు ఆడాడు. 328 ఇన్నింగ్స్లలో 49.52 సగటు, 65.44 స్ట్రైక్ రేట్తో 14,065 పరుగులు సాధించాడు. ఇందులో 40 సెంచరీలు, 69 అర్థసెంచరీలున్నాయి. బెస్ట్ స్కోరు 239 రన్స్. 

టాప్ -5 బ్యాట్స్ మన్...
ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రికీ పాంటింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 559 మ్యాచుల్లో, 667 ఇన్నింగ్స్ లలో 27,368 రన్స్ చేశాడు. ఆ తర్వాత స్టీవ్ వా 493 మ్యాచుల్లో 18,496 పరుగులు, అలన్ బోర్డర్ 429 మ్యాచుల్లో 17,698 పరుగులు, మైకెల్ క్లార్క్ 394 మ్యాచుల్లో 17,112 పరుగులు, వార్నర్ 335 మ్యాచుల్లో 16,612 పరుగులు సాధించి  టాప్ 5లో ఉన్నారు. వీరి తర్వాత మార్క్ వా, గిల్ క్రిస్ట్, హెడెన్, స్మి్త్ ఉన్నారు. వీరిలో వార్నర్, స్మిత్ మాత్రమే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడతుండటం విశేషం. 


  
అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు..
ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రికెట్ దిగ్గజ్ సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత సంగక్కర 28,016 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 27,483 పరుగులతో మూడో స్థానంలో, జయవర్ధనే 25,957 పరుగులతో నాల్గో స్థానంలో, జాక్వెస్ కలీస్ 25,534 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.