ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ టెస్ట్ ప్లేయర్ అనుకుంటే పొరపాటే. ఫార్మాట్ ను బట్టి గేర్ ను మార్చగల సామర్ధ్యం స్మిత్ కు ఉంది. అయితే ప్రస్తుత జనరేషన్ లో ఈ దిగ్గజ క్రికెటర్ వేగంగా ఆడలేడనే పేరుంది. దీంతో ఆస్ట్రేలియా టీ20 జట్టులో స్మిత్ కు చోటు దక్కడం లేదు. వరల్డ్ కప్ కు కూడా ఈ వెటరన్ ప్లేయర్ ను పక్కన పెట్టారు. స్మిత్ మాత్రం సెలక్టర్లకు ఛాలెంజ్ విసురుతూ.. తనలో ఇంకా టీ20 ప్లేయర్ ఉన్నాడని గుర్తు చేశాడు. బిగ్ బాష్ లీగ్ లో కేవలం 41 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తనలోని విశ్వరూపం చూపించాడు.
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా శుక్రవారం ( జనవరి 16) జరుగుతున్న మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్మిత్.. సిడ్నీ థండర్స్ పై పూనకం వచ్చినట్టు ఆడాడు. 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్.. ఆతర్వాత బంతికే ఔటయ్యాడు. ఓవరాల్ గా 42 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. వెస్ అగర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ 13 ఓవర్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ర్యాన్ హ్యడ్లి వేసిన ఈ ఓవర్ లో తొలి నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు కొట్టిన స్మిత్ ఐదో బంతికి ఫోర్ బాదాడు. ఓవరాల్ గా ఈ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ తో 90లోకి అడుగుపెట్టిన స్మిత్.. సంగతి వేసిన 14 ఓవర్లో సింగిల్ తీసుకొని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ విజృంచించడంతో సిడ్నీ విజయం దిశగా దూసుకెళ్తోంది. స్మిత్ పాటు ఓపెనర్ బాబర్ 47 పరుగులు చేసి మంచి సహకారాన్ని అందించాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
- Hundred in Test Cricket.
— Johns. (@CricCrazyJohns) January 16, 2026
- Hundred in BBL.
THE VERSATILE EVERGREEN STEVE SMITH...!!!! 😍🔥 pic.twitter.com/eAnNyQ2hLj
