తిరుమల భక్తులకు ఇచ్చే చేతి కర్రలు ఇవే.. : దొడ్డుగా ఉన్నాయి.. పులులొస్తే కొట్టండి

తిరుమల భక్తులకు ఇచ్చే చేతి కర్రలు ఇవే.. : దొడ్డుగా ఉన్నాయి.. పులులొస్తే కొట్టండి

తిరుమల కాలిబాటలో వెళ్లే భక్తులకు బుధవారం( సెప్టెంబర్ 6)  అలిపిరి మెట్ల మార్గం వద్ద చేతి కర్రల పంపిణీ కార్యక్రమాన్ని టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి  నడకదారిలో చిరుత పులుల దాడుల నేపథ్యంలో TTD రక్షణ చర్యలు చేపట్టింది.  నడకదారిలోని భక్తులను టీటీడీ అధికారులు అలెర్ట్ చేశారు.  తిరుమల కాలిబాట మార్గంలో చిరుత దాడిలో అక్షిత అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి  తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు కర్రలు ఇచ్చి పంపుతున్నారు.  వాటిని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం  తిరిగి తీసుకొని వాటినే రొటేషన్ పద్దతిలో ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.  శ్రీశైలం ఫారెస్ట్ నుంచి  8 వేల 500 కర్రలు తీసుకొచ్చామని టీటీడీ  చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు.  అయితే  నడకదారిలో వన్యమృగాలు సంచరించడంతో భక్తులు  అలిపిరి మార్గంలో భక్తులు తగ్గినట్లు తెలుస్తోంది.