స్టాక్ మార్కెట్ల దూకుడు.. సెన్సెక్స్ ఆల్ టైం రికార్డ్

స్టాక్ మార్కెట్ల దూకుడు..  సెన్సెక్స్ ఆల్ టైం రికార్డ్

 దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్టు సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా  సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.  డిసెంబర్ 11న సోమవారం ప్రారంభమైన ట్రేడ్‌169 పాయింట్లు మెరుగుపడి  ..  సెన్సెక్స్ మొదటిసారిగా 70 వేల అధిగమించింది. తర్వాత స్వల్పంగా 69 వేల 958 పాయింట్ల దగ్గరకు చేరింది.  ఇది డిసెంబర్ 10 తో పోలిస్తే 132.53 పాయింట్లు అధికంగా పెరిగింది. ఇక  నిఫ్టీ  21 వేల మార్క్‌ను టచ్ చేసి.. తర్వాత20 వేల 984  దగ్గర ట్రేడ్ అవుతోంది.   డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ. 83.39గా ఉంది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి   వృద్ధి అంచనాను పెంచడం, అలాగే వడ్డీ  రేట్లను యథాతథంగా ఉంచడం  మార్కెట్లకు బూస్ట్ ని ఇచ్చినట్టైంది. 

సెన్సెక్స్ ఇండెక్స్ లో   హెచ్ సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఎస్బీఐ,కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, అల్ట్రా టెక్ సిమెంట్స్,ఎల్ అండ్ టీ, ఎన్ టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, విప్రో, మారుతి,హెచ్సీఎల్, ఐసీఐసీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.