- ముఖ్యఅతిథిగా హాజరైన డా. మెహర్ మేడవరం
ముషీరాబాద్, వెలుగు: హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని ప్రముఖ డాక్టర్ మెహర్ మేడవరం తెలిపారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్ నివారణ అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, ఐఏఎంఏ ఆఫ్ ఇల్లినాయిస్ అధ్యక్షురాలు డా. మెహర్ మేడవరం హాజరై మాట్లాడారు.
సరైన వయస్సులో హెచ్‌పీవీ టీకా వేయించుకుంటే గర్భాశయ క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. ముఖ్యంగా 9 నుంచి 11 ఏండ్ల మధ్య టీకా వేయించుకోవడం అత్యంత ప్రభావవంతమని స్పష్టం చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆరోగ్యానికి సంబంధించిన అపోహలను తొలగించారు.
