కృష్ణా నదిలో రాళ్ల కట్టలు వేస్తున్రు

కృష్ణా నదిలో రాళ్ల కట్టలు వేస్తున్రు

గద్వాల, వెలుగు: కృష్ణా నదిలో పై భాగాన ఉన్న రైతులు తమకు నీళ్లు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో నదిలో రాళ్లతో కట్టలు వేస్తున్నారు. దీంతో కింద ఉన్న రైతులతో పాటు గ్రామాలకు తాగునీరు ఇబ్బందులు వస్తున్నాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూర్  మండలం రేచింతల గ్రామానికి చెందిన కొందరు రైతులు నదిలో రాళ్లతో కట్టలు కట్టారని గద్వాల మండలం బీరెల్లి, గుర్రం గడ్డ రైతులు వాపోయారు. 

నీళ్లు తక్కువగా వస్తున్నాయని పరిశీలించేందుకు వెళ్లగా రాళ్ల కట్టలు కనిపించాయని తెలిపారు. ఆదివారం రాళ్లతో కట్టలు వేస్తున్న వారి దగ్గరికి వెళ్లి అడ్డగించేందుకు ప్రయత్నించగా తమతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. నదిలో కట్టలు లేకుండా చూసి నీళ్లు వాడుకునేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.